1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (12:36 IST)

ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ.. జాంగ్ బిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.. (video)తర్వాత?

Zhang Zhi Jie
Zhang Zhi Jie
ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో విషాదం చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ.. చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు. 
 
ఉన్నట్టుండి ఆటగాడు గుండెపోటుకు గురై కిందపడిపోవడంతో ఆటగాళ్లు, రిఫరీ, ప్రేక్షకులు షాక్‌లో ఉండిపోయారు. విషయమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరో రెండు నిమిషాల్లో ఆస్పత్రికి తరలించినా.. ప్రాణాలను కాపాడలేకపోయారు. 
 
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జాంగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని కోల్పోయాం అని పీవీ సింధు ట్విట్‌ చేశారు.
 
ఇకపోతే...ఇండోనేషియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధికారికంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ రిఫరీ అనుమతి లేకుండా వైద్య బృందాలు కోర్టులోకి ప్రవేశించడాన్ని నిషేధించే నియమాన్ని సవరించాలని అభ్యర్థించింది.

క్రీడలలో ప్రధాన సూత్రం నియమాలకు కట్టుబడి ఉండటం, అయితే నియమాలు ఎలా రూపొందించబడినా లేదా రిఫరీలు ఎలా వ్యవహరిస్తారనే దానితో సంబంధం లేకుండా, ఆట మైదానంలో జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎల్లప్పుడూ అత్యున్నత నియమంగా ఉండాలని క్రీడా పండితులు అంటున్నారు.