నేను ఇంకా సింగిల్.. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణమే టార్గెట్
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాను ఇంకా సింగిల్ అంటూ వెల్లడించింది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు వివిధ అంశాలపై స్పందించింది.
తన స్టేటస్ సింగిల్ అని.. బ్యాడ్మింటన్ గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించనని, తన గురి అంతా పారిస్ ఒలింపిక్స్ స్వర్ణంపైనే అని స్పష్టం చేసింది. ఇతర సంబంధాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని నమ్ముతానని సింధు చెప్పింది. ఇంతవరకు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదని పీవీ సింధు వెల్లడించింది.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న పీవీ సింధు.. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టింది. ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యం అంటూ పీవీ సింధు తెలిపింది. 28 ఏళ్ల సింధు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె వద్ద శిక్షణ తీసుకుంటోంది.