గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (16:27 IST)

సౌదీలో క్రిస్టియానో ​​రొనాల్డో-జార్జినా రోడ్రిగ్జ్ కలిసి జీవిస్తారా? చట్ట విరుద్ధమా?

Cristiano Ronaldo and Georgina Rodriguez
Cristiano Ronaldo and Georgina Rodriguez
పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో ​​రొనాల్డో-జార్జినా రోడ్రిగ్జ్ కలిసి జీవించడం ద్వారా సౌదీ అరేబియా చట్టాన్ని ఉల్లంఘించారనే టాక్ వస్తోంది. వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో నివసించడం సౌదీలో చట్ట విరుద్ధం. రొనాల్డో, జార్జినా కలిసి ఉన్నారు కానీ వివాహం చేసుకోలేదు. సౌదీ చట్టాల ప్రకారం, వివాహం చేసుకోకుండా ఒకే ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధం. కానీ వారు అధికారులచే శిక్షించబడరు.
 
37 ఏళ్ల అతను మాంచెస్టర్ యునైటెడ్ నుంచి నిష్క్రమించారు. రోనాల్డో అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తుల్లో ఒకరు.  రోనాల్డో ప్రపంచంలోని అత్యంత మార్కెట్ చేయగల అథ్లెట్లలో ఒకరిగా ఉన్నందున, పోర్చుగీస్ స్టార్‌కు శిక్షపడే అవకాశం లేదు. వివాహ ఒప్పందం లేకుండా సహజీవనం చేయడాన్ని సౌదీ చట్టాలు ఒప్పుకోవు. కానీ సౌదీ అధికారులు విదేశీయుల విషయంలో జోక్యం చేసుకోరు.  
 
రొనాల్డో 2016లో రియల్ మాడ్రిడ్ కోసం ఆడినప్పుడు రోడ్రిగ్జ్‌ని కలిశాడు. రోనాల్డో రోడ్రిగ్జ్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు - వారి పేర్లు బెల్లా- అలానా. రొనాల్డోకు మరో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు - క్రిస్టియానో ​​జూనియర్, ఎవా, మాటియో - వారు కవలలు. రోడ్రిగ్జ్ మరియు రొనాల్డో ఇంకా వివాహం చేసుకోలేదు. 
 
క్రిస్టియానో రొనాల్డోకి ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్నారు. జూన్ 17, 2010న రొనాల్డో మొదటిసారి తండ్రి అయ్యాడు. అయితే క్రిస్టియానో జూనియర్‌‌కి జన్మనిచ్చిన తల్లి ఎవరనేది రొనాల్డో సీక్రెట్‌గా ఉంచాడు. ఆ తర్వాత కొన్నేళ్లు రష్యన్ మోడల్ ఇరినాతో రిలేషన్‌షిప్ సాగించాడు.
 
2015లో ఆమెతో రిలేషన్‌కు బ్రేకప్ చెప్పాడు. జూన్ 8,2017న అమెరికాలో సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడు. ఆ తర్వాత నుంచి జార్జినాతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడు.