1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2016 (16:00 IST)

నేను డ్రగ్స్ తీసుకోలేదు.. తప్పుచేస్తే నన్ను ఉరితీయండి : నర్సింగ్ యాదవ్

రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన మల్లయుద్ధవీరుడు నార్సింగ్ యాదవ్. డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో అతనిపై నాలుగేళ్ళ నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్ట

రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన మల్లయుద్ధవీరుడు నార్సింగ్ యాదవ్. డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో అతనిపై నాలుగేళ్ళ నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) ఇటీవల సంచలన తీర్పును వెలువరించింది. దీంతో రియో ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి వైదొలిగాడు.
 
దీనిపై నర్సింగ్ యాదవ్ స్పందిస్తూ... 'నేను తప్పు చేసి ఉంటే నన్ను ఉరితీయండి. కానీ నా జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. అది సత్యం. ఈరోజు నేను వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను. నన్ను అనుమతించిఉంటే తప్పకుండా దేశానికి పతకాన్ని తెచ్చేవాణ్ణి. ఈరోజు నర్సింగ్ కాదు దేశం పతకాన్ని కోల్పోయింది' అని పేర్కొన్నాడు. 
 
తన ప్రత్యర్థులు తన ఆహారం, డ్రింక్స్ లో డ్రగ్స్ కలుపడం వల్ల డోపింగ్ టెస్టు తనకు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని 74 కిలోల విభాగం రెజ్లర్ అయిన నర్సింగ్ పేర్కొన్నాడు.