మంగళవారం, 17 జూన్ 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2016 (17:26 IST)

రియో ఒలింపిక్స్‌లో పురుషులు నగ్న డైవింగ్ చేశారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పురుష క్రీడాకారులు నగ్న డైవింగ్ చేశారని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. పురుషుల డైవింగ్ అనేది ఒలింపిక్స్‌లో చాలా పాపులర్ అయినప్పటికీ.. ప్రస్తుతం అది వివాదానికి దా

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో పురుష క్రీడాకారులు నగ్న డైవింగ్ చేశారని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. పురుషుల డైవింగ్ అనేది ఒలింపిక్స్‌లో చాలా పాపులర్ అయినప్పటికీ.. ప్రస్తుతం అది వివాదానికి దారి తీసింది. గాలిలో గింగిరాలు తిరుగుతూ క్రీడాకారులు చేసే అద్భుతమైన ఈ డైవింగ్ విన్యాసాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి రియోలో జరిగిన డైవింగ్ ఈవెంట్‌ ప్రేక్షకులను కళ్లప్పగించకుండా చూసేట్లు చేసింది.
 
ఈ ఈవెంట్‌ను తిలకించిన చాలామందికి డైవర్స్ నగ్నంగా డైవ్ చేశారా అనే అనుమానం వచ్చింది. కండల వీరులుగా లోదుస్తులతో మాత్రమే డైవ్ చేసిన ఆ డైవర్స్ చూసి.. అందరూ షాక్ అయ్యారు. సరిగ్గా లోదుస్తులు ధరించే ప్రాంతంలోనే వ్యూహాత్మకంగా స్కోరు బోర్డును చానెళ్ల చూపించడంతో.. సదరు ఆటగాళ్లు ఒంటిపై నూలుపోగులేకుండా ఈ పోటీల్లో పాల్గొన్నారా? నగ్నత్వాన్ని కవర్ చేసేందుకే ఆ ప్రాంతంలో స్కోరుబోర్డును ఇచ్చారా? అంటూ పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అమెరికా నటి కిరా కొసారిన్ కూడా వంత పాడింది. మొత్తానికి ఈ ఈవెంట్‌పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.