శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 6 జులై 2017 (17:29 IST)

'నేను మతిలేకుండా ఆడుతున్నా' : విశ్వనాథ్ ఆనంద్

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశారో.. తెలియక చేశారో తెలియదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశారో.. తెలియక చేశారో తెలియదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'నేను మతి లేకుండా ఆడుతున్నా. ఇది నిజంగా అర్థంలేని ప‌ని. ఇలా ఆడ‌టం కంటే ఆడ‌క‌పోవ‌డం శ్రేయ‌స్క‌రం' అంటూ కామెంట్స్ చేశారు. నిజమే.. ఈ మధ్యకాలంలో విశ్వనాథ్ ఆనంద్ గొప్ప ఆటతీరును కనబరచలేక పోతున్నాడు. 
 
ఆల్టీబాక్స్ నార్వే చెస్ పోటీలో తొలి రౌండు‌లోనే ఓడిపోవ‌డం, లూవెన్ లెగ్ గ్రాండ్ చెస్ టూర్‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో నిల‌వడం వంటి అంశాలు ఆయ‌న ఆట‌తీరును ప్ర‌భావితం చేసినట్టుగా కనిపిస్తున్నాయి. అందువల్లే ఆయన చెస్‌కు గుడ్‌పై చెప్పే ఆలోచనలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు.