శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 జూన్ 2018 (08:48 IST)

నా భర్తకు వివాహేతర సంబంధం... సమాజంలో కామనేనట : స్కేటర్ రుచిక

తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ప్రముఖ జాతీయస్థాయి స్కేటింగ్‌ క్రీడాకారిణి రుచిక ఆరోపణలు చేసింది. ఈ సంబంధాన్ని తన భర్త బంధువులు, పెద్దలు కూడా సమర్థిస్తున్నారని తెలిపారు.

తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ప్రముఖ జాతీయస్థాయి స్కేటింగ్‌ క్రీడాకారిణి రుచిక ఆరోపణలు చేసింది. ఈ సంబంధాన్ని తన భర్త బంధువులు, పెద్దలు కూడా సమర్థిస్తున్నారని తెలిపారు. ఈ అక్రమ సంబంధ వ్యవహారగుట్టు సదరు మహిళకు తన భర్త చేసిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొంది.
 
ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గత యేడాది డిసెంబరులో బోయినపల్లికి చెందిన అక్షయ్‌ జైన్‌ అనే నగల వ్యాపారితో రుచిక వివాహం జరిగింది. 3 నెలలపాటు వీరు అన్యోన్యంగానే ఉన్నారు. భర్త ఫోన్‌లో ఉన్న మెసేజ్‌ల ద్వారా మారేడుపల్లికి చెందిన మరో యువతితో అతడు వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ఆమె గ్రహించింది. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు తెలపడంతో జైన్‌ సొసైటీ పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడించారు.
 
అపుడు, అతడు చేసింది పెద్ద తప్పేమీ కాదని.. ఇవన్నీ సహజమేనని భర్త తరపు బంధువులు అక్షయ్‌నే సమర్థించారు. కానీ రుచిక మాత్రం ఇది సరైన పద్ధతి కాదని పేర్కొంటూ గత నెల 25న బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. భార్యను కాదని మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తికే మద్దతు పలకడం సరికాదని.. తనకు న్యాయం చేయాలని ఆమె ప్రాధేయపడింది. ఈ సందర్భంగా సదరు యువతితో తన భర్త జరిపిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ వివరాలను ఆమె బయటపెట్టారు. కాగా, రుచిక ఆరోపణలను భర్త అక్షయ్‌ ఖండించారు. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనన్నాడు.