గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (10:42 IST)

భారతీయ వీధుల్లో పశువులు - కోతులే ఉంటాయి.. బాస్కెట్ బాల్ స్టార్

భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ప్రశంసిస్తుంటారు. అయితే, ప్రపంచ బాస్కెట్ బాల్ అటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకడైన ఎన్బీఏ

భారత్ గురించి ప్రపంచ దేశాలన్నీ గొప్పగా చెప్పుకుంటాయి. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎంతగానో ప్రశంసిస్తుంటారు. అయితే, ప్రపంచ బాస్కెట్ బాల్ అటగాళ్లలో అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఒకడైన ఎన్బీఏ స్టార్ ఆటగాడు కెవిన్ దురాంత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గోల్డెన్ స్టేట్ వారియర్స్ తరఫున బాస్కెట్ బాల్ ఆడే కెవిన్ ఇటీవల తాను జరిపిన భారతీయ పర్యటనపై తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలే ఇపుడు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. భారతీయులకు ఎంతమాత్రమూ తెలివితేటలు లేవని, నాలెడ్జ్ విషయంలో ఇండియన్స్ 20 ఏళ్లు వెనకుండి పోయారన్నారు. 
 
"ఇక్కడ నాకు వినూత్న అనుభూతి లభించింది. వాస్తవానికి ఇండియా గురించి నాకేమీ తెలియదు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ దేశాల గురించి కొంతైనా తెలుసుకుని వెళ్లినవే. కానీ ఇండియాకు అలా రాలేదు. దుబాయ్‌కి వచ్చి, అక్కడి నుంచి ఇండియాకు వెళ్లాను. ఇక్కడి సంస్కృతిని చూశాను. తెలివితేటలు, అనుభవం విషయంలో ఇక్కడి ప్రజలు 20 ఏళ్లు వెనుకంజలో ఉన్నారు. 
 
ఇప్పటికీ వీధుల్లో పశువులు తిరుగుతున్నాయి. కోతులు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుంటాయి. రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై వందలాది మంది పడున్నారు. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అత్యధికులు పేదలే" అన్నాడు. తాను సందర్శించిన తాజ్ మహల్ గురించి వివరిస్తూ, దీన్ని కాపాడటంలో మాత్రం భారత్ విజయం సాధించిందని, ఇక్కడ చాలా పరిశుభ్రత కనిపించిందని చెప్పాడు.