ప్రియురాలి మనసు గెలుచుకున్న సాకేత్ మైనేని.. ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్
భారత టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్‌తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు.
భారత టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్‌తో డేవిస్ కప్ ఆటలకు బయలుదేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు.
ఈ విందులో సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్ తదితరులు చూస్తున్న వేళ, మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబీ పువ్వును ఇస్తూ, తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు.
ఆ పువ్వును నవ్వుతూ అందుకున్న శ్రీలక్ష్మి సిగ్గులొలుకుతూ సాకేత్‌తో వివాహానికి అంగీకరించింది. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, కాబోయే జంట కేక్‌ను కట్ చేసింది. ఇక తన సమక్షంలో ఇదే తొలి పెళ్లి ప్రపోజల్ అంటూ స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.