బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (10:16 IST)

ISL Special: 0-0 తేడాతో ముంబైకి చెక్ పెట్టిన హైదరాబాద్

Hyderabad FC
ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఏడో సీజన్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తానేంటో నిరూపించుకుంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తున్న టేబుల్ టాపర్ ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌ జోరుకు అడ్డుకట్ట వేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 0-0తో ముంబైని నిలువరించింది. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు అందుకున్న హైదరాబాద్.. పటిష్ట ముంబైని అడ్డుకోవడంలో సక్సెస్ అయింది.
 
ఒక్క గోల్ కూడా సాధ్యంకాని ఈ మ్యాచ్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ముంబై గోల్ ప్రయత్నాలను గోల్ కీపర్ లక్ష్మీకాంత్ తిప్పికొట్టాడు. డిఫెండర్ ఆకాశ్ మిశ్రా కూడా సత్తా చాటాడు. హైదరాబాద్ కూడా గోల్ అవకాశాలను సృష్టించుకున్నా.. ముంబై డిఫెన్స్ పటిష్టంగా ఉండటంతో ఖాతా తెరువలేకపోయింది.
 
ఓవరాల్‌గా 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు 2 డ్రాలు, ఒక ఓటమితో ముంబై 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. అన్నే మ్యాచ్‌లాడిన హైదరాబాద్ 4 విజయాలు, 4 డ్రాలు, మూడు ఓటములతో 16 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో నిలిచింది.