శుక్రవారం, 15 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (17:57 IST)

విద్యార్థి మెడలో నుంచి దూసుకెళ్లిన జావెలిన్ త్రో

javelintrow
ఒరిస్సాలోని బలంగీర్ జిల్లాలో ఓ విషాదక ఘటన చోటుచేసుకుంది. పాఠశాల వార్షికోత్సవాల్లో భాగంగా వివిధ రకాలైన క్రీడా పోటీలను నిర్వహించారు. వీటిలో ఒకటి జావెలిన్ త్రో. ఓ విద్యార్థి విసిరిన జావెలిన్ త్రో అదుపుతప్పి మరో విద్యార్థి మెడలోకి దూసుకెళ్లింది. అయితే, అదృష్టవశాత్తు బాధిత విద్యార్థి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బలంగీర్ జిల్లాలోని అగల్‌పూర్ బాలుర హైస్కూల్‌లో జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా, అది అదుపుతప్పి, ప్రమాదవశాత్తు మెహర్ అనే విద్యార్థి మెడలో నుంచి దూసుకెళ్లింది. ఆ వెంటనే బాధిత విద్యార్థిని బలంగీర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి విద్యార్థి మెడ నుంచి జావెలిన్ త్రోను వెలికి తీశారు. బాధిత విద్యార్థి ప్రస్తుంత ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అలాగే, బాధిత విద్యార్థికి జిల్లా కలెక్టర్ తక్షణ సాయంగా రూ.30 వేలు నగదు కూడా అందజేశారు. 
 
కాగా, ఈ ఘటనపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. బాలుడికి మరింత మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఆయన ఉన్నాతాధికారులను అందించారు. అందుకు అవసరమైన నిధుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఉపయోగించాలని సూచించారు.