శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2022 (22:19 IST)

కింగ్ కోబ్రా కాటేస్తే.. ఆ వ్యక్తి ఏం చేశాడంటే.?

king cobra
కింగ్ కోబ్రా కాటేస్తే.. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తారు. అయితే ఓ వ్యక్తి తనను కింగ్ కోబ్రా కాటేసినా.. ఆసుపత్రికి వెళ్లకుండా దానిపై పగ తీర్చుకున్నాడు. దాన్ని కొట్టి చంపి పగ తీర్చుకోలేదు. కింగ్ కోబ్రాను పట్టుకొని నోటితో కొరికి కొరికి మరీ చంపాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లాలోని బస్తా బ్లాక్ పరిధిలోని దర్దా గ్రామంలో సలీం నాయక్‌ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తుంటాడు. బుధవారం సలీం పొలం పనులు చేస్తుండగా.. అతని కాలుపై నాగుపాము కాటు వేసింది. నాయక్ చికిత్స చేయించుకోకుండా పొలంలో పాము కోసం వెతికాడు. 
 
పాము కనబడగానే తన చేతులతో పట్టుకున్నాడు. ఆవేశంతో పామును శరీరమంతా నోటితో కొరికాడు. పాము చనిపోయే వరకు సలీం కోరుకుతోనే ఉన్నాడు. చివరకు అది చనిపోయింది. సలీం నాయక్‌ అక్కడితో ఆగలేదు. పామును మెడకు చుట్టుకుని సైకిల్‌పై గ్రామం మొత్తం తిరిగాడు. ఆ తర్వాత నాటు వైద్యం చేయించుకున్నాడు.