శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (12:45 IST)

పీవీ సింధూ ఘన విజయం... ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకున్న తెలుగు తేజం!

సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధూ, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఘన విజయం సాధించింది.

సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో తెలుగుతేజం పీవీ సింధూ, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 22-20 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో సెట్‌ను 11-21 తేడాతో ఓడిపోయి, కీలకమైన మూడో సెట్‌లో పుంజుకుంది.
 
నిర్ణయాత్మకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ, మూడో సెట్‌ను 21-18 తేడాతో గెలిచి, ఇటీవలి వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఒకుహరా చేతిలో తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడో సెట్‌లో ఒకుహరా చేసిన తప్పిదాలనే తనకు అనుకూలంగా మలచుకున్న సింధూ, తన కెరీర్‌లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ సెట్‌లో సింధూ 18-16 తేడాతో లీడింగ్‌లో ఉన్న వేళ, 56 షాట్ల ర్యాలీ జరుగగా, కీలక పాయింట్ సింధూ ఖాతాలో చేరి ఆమెకు 19వ పాయింట్‌ను అందించింది. అదే ఉత్సాహంతో సింధూ మ్యాచ్‌ని సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఆమె గెలుపుపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేశారు.