ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (13:45 IST)

9 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు... 30 మంది వేశ్యలు.. రిసార్టులో పార్టీ...

మరో వారంరోజుల్లో ఫిపా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన జట్లు పాలుపంచుకోనున్నాయి. అలాంటి జట్లలో మెక్సికో ఒకటి. ఈ టోర్నీ కోసం యూరప్‌కు మెక్సికో జట్టు సభ్యులు

మరో వారంరోజుల్లో ఫిపా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన జట్లు పాలుపంచుకోనున్నాయి. అలాంటి జట్లలో మెక్సికో ఒకటి. ఈ టోర్నీ కోసం యూరప్‌కు మెక్సికో జట్టు సభ్యులు బయలుదేరారు. అందరిలాగా సాదాసీదాగా బయలుదేరితే అందులో మజా ఏముందని అనుకున్నారో ఏమోగానీ.. వేశ్యలతో కలిసి ఎంచక్కా మజా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో ఇపుడు కలకలం రేగింది.
 
యూరప్‌కు బయలుదేరి వెళ్లే ముందు తమ దేశపు ఆటగాళ్లకు మెక్సికో వీడ్కోలు పలుకుతూ 30 మంది వేశ్యలతో కలిసి పార్టీ ఇచ్చిందట. ఓ ప్రైవేటు రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొమ్మిది మంది ఆటగాళ్ల కోసం 30 మంది వేశ్యలను పిలిపించారని, స్కాట్లాండ్‌పై 1-0 తేడాతో జట్టు విజయం సాధించిన తర్వాత, ఈ పార్టీ జరిగిందని చెబుతూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అక్కడి మ్యాగజైన్ ఒకటి ప్రచురించింది. 
 
ఈ వార్తలపై స్పందించిన అధికారులు, ఖాళీగా ఉన్న సమయంలో వారు పార్టీ చేసుకున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండవని వ్యాఖ్యానించడం గమనార్హం. వాళ్లు శిక్షణా శిబిరాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారని, సెలవు రోజున వారి వ్యక్తిగత స్వేచ్ఛ వారిదేనని ఆయన చెప్పడం ఈ వార్తలను నిజం చేస్తున్నాయి. దీంతో ఆటగాళ్లు మరింతగా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.