శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (15:52 IST)

ఇంతకీ ''నీ స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు?'' సానియా ప్రశ్న

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఆగస్ట్ 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఆమె.. తన ట్విటర్ పేజీలో శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు, త

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఆగస్ట్ 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఆమె.. తన ట్విటర్ పేజీలో శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు, తన అభిమానులకు మీ భారతీయ వదిన తరఫున శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.


పాకిస్థాన్‌లో ఉన్న భర్తకు, అభిమానులకు, పాకిస్థానీయులకు ఆగస్ట్ 14న స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ సమాధానం ఇచ్చారు. 
 
భారతీయులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన షోయబ్.. ప్రత్యేకంగా పుట్టింట్లో ఉన్న సానియాను గుర్తు చేసుకున్నారు. దీన్ని ట్రోల్ చేసిన ఓ నెటిజన్ ''మీ స్వాతంత్ర్య దినోత్సవం కూడా ఇవాళే అనుకుంట కదా?'' అంటూ వెటకారం చేశాడు. దీంతో టెన్నిస్ స్టార్ గట్టి రిప్లై ఇచ్చింది.

ఆగస్టు 14న తన భర్త, వాళ్ల దేశానికి స్వాతంత్ర్య దినోత్సవం. తనకు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే..  గందరగోళం తీరిందనుకుంటా.. ఇంతకీ ''నీ స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు?'' అంటూ రీ ట్వీట్ చేసింది.