డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓటమి.. టెన్నిస్‌కు నాదల్ గుడ్ బై
డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓడిపోయింది. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టులో తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకున్న రఫెల్ నాదల్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ దిగ్గజం నెదర్లాండ్స్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌తో తలపడి 6-4, 6-4 తేడాతో ఓడిపోయాడు. కాగా.. డేవిస్ కప్‌లో ఓటమితోనే సుదీర్ఘ కెరీర్‌ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించడం గమనార్హం.
సింగిల్ మ్యాచ్‌లో బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో నాదల్ 4-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. అయితే.. కార్లోస్ అల్కరాజ్ 7-6 (7/0), 6-3తో టాలోన్ గ్రీక్స్‌పూర్‌ను ఓడించాడు. దీంతో 1-1తో స్పెయిన్, నెదర్లాండ్స్ సమంగా నిలిచాయి.
నిర్ణయాత్మక డబుల్స్‌లో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ఓడిపోయారు. దీంతో నెదర్లాండ్స్ 2-1 తేడాతో సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.