బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (19:30 IST)

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్

Nadal
Nadal
టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 38 ఏళ్ల వయసులో తన అభిమాన క్రీడకు వీడ్కోలు పలకాలని ఈ స్పెయిన్ బుల్ నిర్ణయించింది. తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన నాదల్.. నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించాడు. 
 
నవంబర్ 19, 21 మధ్య జరిగే డేవిస్ కప్ ఫైనల్‌లో స్పెయిన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఈ మేరకు ఓ వీడియో ద్వారా వెల్లడించిన రఫెల్ నాదల్.. తాను ప్రొఫెసనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 
 
కానీ, జీవితంలో ప్రతి ప్రారంభానికి ముగింపు ఉంటుంది. తన కెరీర్‌ను ముగించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నానని... ఇంత సుదీర్ఘ కెరీర్‌ను తానెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు తన చివరి మ్యాచ్‌పై చాలా ఉత్సాహంగా ఉందని తెలిపాడు.