బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (12:27 IST)

కేరళకు రానున్న ఫుట్ బాల్ దేవుడు లియోనల్ మెస్సీ

Messi
Messi
లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ కోసం కేరళ రాష్ట్రానికి రానున్నట్లు కేరళ క్రీడా మంత్రి వి అబ్దురహిమాన్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పర్యవేక్షణలో మ్యాచ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. 
 
"ఈ హై-ప్రొఫైల్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను నిర్వహించడానికి అన్ని ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాపారులు అందిస్తారు" అని మంత్రి చెప్పారు. చారిత్రాత్మక సందర్భాన్ని నిర్వహించగల కేరళ సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఈ ఉన్నత స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహణకు రాష్ట్రంలోని వ్యాపారవేత్తలు అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తారని మంత్రి తెలిపారు. భారత్‌లోనూ, కేరళలోనూ మెస్సీపై అభిమానం ఎనలేనిది. కేరళలో ఫుట్ బాల్‌కు ప్రజల హృదయాల్లో ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉంది.