బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (12:09 IST)

విజయవాడ నుంచి కొచ్చికి విమాన సేవలు కావాలి.. అయ్యప్ప భక్తులు

Ayyappa Devotees
కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లేందుకు గాను విజయవాడ నుంచి కొచ్చి, తిరువనంతపురంలకు నేరుగా విమాన సర్వీసులు అందించాలని అయ్యప్ప భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతం నుండి వేలాది మంది అయ్యప్ప భక్తులు తమ అయ్యప్ప దీక్షను పూర్తి చేసుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి లక్షలాది మంది భక్తులు శీతాకాలంలో అయ్యప్ప మాల దీక్షను పాటిస్తారు. ఆపై తమ దీక్షను విరమించుకోవడానికి శబరిమలను సందర్శిస్తారు. 2025 జనవరి 20 వరకు శబరిమల ఆలయానికి వెళ్లే విమానాల్లో అయ్యప్ప యాత్రికులు తమ క్యాబిన్ బ్యాగేజీలో కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతినిస్తోంది.
 
అయితే తాజాగా విజయవాడ విమానాశ్రయం నుండి కొచ్చికి రోజువారీ విమాన సర్వీసును ప్రారంభించాలని యాత్రికులు విమానయాన సంస్థలను కోరారు. తిరువనంతపురం వచ్చే మూడు నెలలు ఈ సేవలు నడవాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.