మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (21:54 IST)

తొలిసారిగా సైనాను చిత్తుచిత్తు చేసిన పీవీ సింధు...

పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో

పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో శ్రీ ఫోర్ట్ కాంప్లెక్సులో జరిగిన మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధు విజయం సాధించింది.
 
ఇకపోతే సైనా పుల్లెల గోపీచంద్ సారధ్యంలో ఆడకుండా బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐతే పీవీ సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే తర్ఫీదు తీసుకుంటూ ఆమధ్య ఒలిపింక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.