చైనా ఓపెన్‌లోనూ చేతులెత్తేసిన సైనా నెహ్వాల్.. పీవీ సింధు మాత్రం అదరగొట్టింది..
చైనా ఓపెన్‌లో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మళ్లీ చేతులెత్తేసింది. ఈ ఏడాది టైటిల్స్ వేటలో వెనక్కి తగ్గిపోయిన సైనా నెహ్వాల్.. చైనా ఓపెన్లోనూ అదే తంతు కొనసాగించింది. అయితే ప్రతిష్టాత్మక ఒలింపిక
చైనా ఓపెన్‌లో హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మళ్లీ చేతులెత్తేసింది. ఈ ఏడాది టైటిల్స్ వేటలో వెనక్కి తగ్గిపోయిన సైనా నెహ్వాల్.. చైనా ఓపెన్లోనూ అదే తంతు కొనసాగించింది. అయితే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధు మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. చైనా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు శుభారంభం చేయగా, తొలి రౌండ్లోనే సైనా నిరాశపరిచింది.
మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా మూడు నెలల తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రిమియర్ బ్యాడ్మింటన్ టోర్నీతో మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన తొలిరౌండ్లో సైనా తన థాయ్‌లాండ్ ప్రత్యర్థిపై పైచేయి సాధించలేకపోయింది. థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోర్న్‌టిప్ బురనప్రసేత్యుతో తలపడిన సైనా మెరుగైన షాట్లతో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా 16-21, 21-19, 14-21 పాయింట్ల తేడాతో సైనా పరాజయం పాలైంది.
అయితే పీవీ సింధు మాత్రం తన సత్తా చాటింది. చైనా ఓపెన్‌లో తొలి రౌండ్లో గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా పీవీ సింధు రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి సిన్ లీతో తలపడిన సింధు... ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. ఫలితంగా 21-12, 21-16తో కేవలం 34 నిమిషాల్లోనే విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.