శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 మార్చి 2017 (13:42 IST)

భర్త క్రికెట్ ఆడుతుంటే ఆసక్తిగా తిలకిస్తూ.. బయోపిక్ కోసం సానియా..

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆడుతున్న మ్యాచ్‌లను ఆ

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. ఈ లీగ్‌లో తన భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆడుతున్న మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకిస్తూ సానియా మీర్జా ప్రోత్సహిస్తోంది.
 
స్టాండ్స్‌లో కూర్చుని తన భర్త ఆటను గమనిస్తోంది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. తనకు గతంలో క్రికెట్‌పై అంత ఆసక్తి ఉండేది కాదని, షోయబ్‌ని పెళ్లి చేసుకున్నాక క్రికెట్‌ను కూడా ఆస్వాదించడం మొదలుపెట్టానని తెలిపింది.  
 
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా తన బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో ఉంది. ఇందుకోసం దర్శకులు, నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇంకా సానియా బయోపిక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఖరారు కాలేదు.