శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:58 IST)

35 యేళ్ల సెరెనా విలియమ్స్ 20 వారాల గర్భవతి... నిజామా?

అమెరికా టెన్నిస్ నల్ల కలువల్లో ఒకరు సెరెనా విలియమ్స్. లేటు వయసులో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 35 యేళ్లు. కానీ, ఈమె ఇపుడు 20 వారాల గర్భవతట. స్నాప్‌ చాట్‌లో తన ఫొటో కూడా పెట్టింది.

అమెరికా టెన్నిస్ నల్ల కలువల్లో ఒకరు సెరెనా విలియమ్స్. లేటు వయసులో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 35 యేళ్లు. కానీ, ఈమె ఇపుడు 20 వారాల గర్భవతట. స్నాప్‌ చాట్‌లో తన ఫొటో కూడా పెట్టింది. తర్వాత ఫొటోను తీసేసింది. ఈ సందర్భంగా సెరెనాకు అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌ సంఘం(డబ్ల్యూటీఏ) అభినందనలు కూడా తెలిపింది. 
 
ఆ ట్వీట్‌ను కూడా తర్వాత తొలిగించారు. సెరెనా ప్రస్తుతం రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మధ్య గత డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. గర్భందాల్చిన వార్త నిజమైతే సెరెనా ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ సహా ఈ ఏడాదంతా ఆడే అవకాశం లేదు. మోకాలి గాయమని చెప్పి మార్చిలో జరిగిన ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ నుంచి ఆమె తప్పుకున్న విషయం తెల్సిందే.