రియోకు ఒంటరిగా వెళ్లా.. కోట్ల మంది ప్రేమతో తిరిగొచ్చా.. పెళ్లికి సిద్ధం : సాక్షి
రియో ఒలింపిక్స్ క్రీడల కోసం ఒంటరిగా వెళ్లా.. వచ్చేటప్పుడు దేశం మొత్తం నా వెంట ఉంది అని కాంస్య పతక విజేత సాక్షిమాలిక్ అన్నారు. దేశ ప్రజలు తనపై ఈ ప్రేమను చూపిస్తే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని బంగార
రియో ఒలింపిక్స్ క్రీడల కోసం ఒంటరిగా వెళ్లా.. వచ్చేటప్పుడు దేశం మొత్తం నా వెంట ఉంది అని కాంస్య పతక విజేత సాక్షిమాలిక్ అన్నారు. దేశ ప్రజలు తనపై ఈ ప్రేమను చూపిస్తే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని బంగారు పతకంగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచిన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రియో ఒలింపిక్స్‌లో కాకలు తీరిన క్రీడాకారులంతా ఒట్టి చేతులతో వెనక్కొస్తుండగా... ఇక ఈ దఫా మనకు ఒలింపిక్స్ లేదని భారతీయులంతా నిరాశలో కూరుకుపోయిన తరుణంలో సత్తా చాటి భారత పతకాల ఖాతా తెరచిన స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ శనివారం మరో సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాదిలోనే తాను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
వెరసి పతకం తెచ్చి భారతీయులను సంతోషంలో ముంచేసిన ఆమె పెళ్లి మాట చెప్పి మరింత సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సహచర రెజ్లర్‌నే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పిన సాక్షి... అతడి పేరు మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని పేర్కొంది. పెళ్లితో తన కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పిన ఆమె... టోక్యోలో పతకం దిశగానే ముందుకు సాగుతానని ప్రకటించింది.