సంబంధిత వార్తలు
- స్పెయిన్ యువరాణి కరోనాకు మృతి .. కోలుకున్న కెనడా ప్రధాని భార్య
- అమెరికాలో 'కరోనా' మరణాల విశ్వరూపం... స్పెయిన్‌ను కబళిస్తున్న 'వైరస్'
- కరోనా మరణమృదంగం : ఎవరిని బతికిస్తారో.. ఎవరిని చంపేస్తారో మీ యిష్టం!!
- కరోనా అమెరికాలో విలయతాండవం.. 81వేల కరోనా కేసులు
- సెంచరీ కొట్టిన కరోనా కేసులు... స్పెయిన్‌లో ఒకేరోజు 1500 పాజిటివ్ కేసులు
ఆ ఫుట్ బాల్ మ్యాచే కొంపముంచిందా..?
Football
ఈ మ్యాచ్‌ను స్టేడియంతో పాటు బార్లు, బహిరంగ ప్రదేశాల్లో వేలాదిమంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. అనంతరం రెండు రోజులకే లొంబర్డీ ప్రాంతంలోని ఒక ఇటలీ దేశస్థుడికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. అప్పటికే అతను వందలమందితో సన్నిహితంగా మెలిగాడు. ఆ వందలమంది వేలమందికి వైరస్ అంటించారు.
అటు స్పెయిన్‌లోనూ మ్యాచ్‌కు వెళ్లివచ్చినవారిలో దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించాయి. స్పెయిన్‌లోని వెలన్షియాలో పలువురు అదే లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అనేకమంది ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వెళ్లి వచ్చిన వారు లేదా వారి కుటుంబసభ్యులు కావడం గమనార్హం.
కరోనా మహమ్మారిని గుర్తించిన స్పెయిన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రజలు పట్టించుకోలేదు. మార్చి 13న స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. కేంద్రప్రభుత్వ వైఖరి నచ్చని అనేక ప్రాంతాలు లాక్‌డౌన్‌ను ప్రశ్నించడంతో లాక్‌డౌన్ లక్ష్యం నీరుగారింది. దీంతో వైరస్ వ్యాప్తి అధికం కావడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది.
తర్వాతి కథనం
