1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 నవంబరు 2021 (22:25 IST)

నెయ్యితో చేసిన సున్నుండలు, భలే టేస్ట్...

నెయ్యి, మినపప్పుతో చేసిన సున్నుండలు చాలా టేస్టుగా వుంటాయి. పిల్లలకి ఇవి మంచి శక్తినిస్తాయి. వీటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

 
కావలసిన పదార్థాలు:
మినప్పప్పు .. ఒక కేజీ
నెయ్యి.. సరిపడా
యాలకుల పొడి... అర టీస్పూను
పంచదార... అరకేజీ

 
తయారీ విధానం :
మినప పప్పును బాగా దోరగా వేయించి, చల్లార్చి... మిక్సీ లేదా మిషన్‌లో వేసి పిండి పట్టించి, జల్లించి ఉంచుకోవాలి. తరువాత పంచదారను కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకుని జల్లెడ పట్టుకుని ఉంచాలి.

 
తరువాత మినప పిండి, పంచదార, యాలకుల పొడిని బాగా కలుపుకోవాలి. నెయ్యి కాచి మినప్పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి. చివరగా పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత తీసుకుని గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే మినప సున్నుండలు రెడీ అయినట్లే...! వీటిని తింటే చిన్నపిల్లలకు మంచి బలం, శక్తి కలుగుతాయి.