శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (19:27 IST)

సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి-7న ప్రమాణ స్వీకారం.. ఢిల్లీ నుంచి పిలుపు..

Revanth Reddy
సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి పేరు ఖరారైనట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే అధికార యంత్రాంగం ప్రకటనతో రేవంత్ రెడ్డి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు.
 
కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ పేరు ఖరారు కావడంతో రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు హోటల్ ఎల్లాలో రేవంత్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం రేవంత్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మంత్రి వర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.