శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (22:47 IST)

రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ కన్ఫర్మ్, మిగతా పోస్టులపైనే చిక్కుముడి

revanth reddy
పీసీసి అధ్యక్షుడుగా వున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫిక్స్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్ నాయకులతో పాటు అందరూ సీఎంగా రేవంత్ రెడ్డికి మద్దతు పలకడంతో దానిపై లైన్ క్లియర్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
మరోవైపు టీవీ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. భట్టి విక్రమార్కకి కట్టబెట్టాల్సిన పదవి విషయంతో పాటు ఉత్తమ కుమార్ రెడ్డి, ఇంకా సీనియర్ నాయకులకు ఇవ్వాల్సిన పదవులపై చిక్కుముడి పడినట్లు తెలుస్తోంది. వీటిపై ఎమ్మెల్యేలు అందరూ ఏకాభిప్రాయానికి రావాలని సూచన చేసినట్లు తెలుస్తోంది.
 
ఉపముఖ్యమంత్రి పోస్ట్ విషయంలో ఇద్దరు కాకుండా తనకు మాత్రమే ఇవ్వాలని భట్టి విక్రమార్క పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనితో ఈ విషయం కొలిక్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో డి.కె శివకుమార్ విషయం ఏఐసిసి అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ పయనమై వెళ్లారు. ఐతే అక్కడ ఢిల్లీ పెద్దలంతా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిజీగా వుండటంతో ఈ అంశంపై మాట్లాడేందుకు కాస్తంత జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.