గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (10:17 IST)

హ్యాట్రిక్ లోడింగ్ 3.0... కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR
KTR
తెలంగాణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం కొనసాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ప్రకటించాయి. 70 సీట్లతో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సర్వేలు తప్పని తేలితే క్షమాపణలు చెబుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
 
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల ఫలితాల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు, తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌‌కు ముందు మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ లోడింగ్ 3.0. సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గన్ గురిపెట్టినట్లుగా ఉన్న తన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.