సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (19:10 IST)

హ్యాట్రిక్‌ సాధించి కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.. కేటీఆర్

ktrao
ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుంది. గురువారం (నవంబర్ 30) సాయంత్రం పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
 
ఎగ్జిట్ పోల్స్ చూసి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురికావద్దన్నారు. గతంలోనూ ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ చూశాం. ఎగ్జిట్ పోల్స్ పేరుతో బీభత్సం సృష్టిస్తున్నారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. క్యూలో చాలా మంది ఉన్నారు. 
 
ఓటింగ్ ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలు ఫలితాలు డిసెంబర్ 3న వస్తాయి. మాకు 70కి పైగా సీట్లు వస్తాయి. బీఆర్‌ఎస్ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్‌ సాధించి కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.