తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)
విద్యార్థులు భద్రంగా వుండాలి.. భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడటం చూసి హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి చనిపోయినా తల్లి చదవిస్తుందని కంటతడి పెట్టుకుంది.. ఆ చిన్నారి మాటలకు చలించిపోయిన హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. జీవితమంటే మార్కులు, ర్యాంకులు కాదని.. జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మా గాంధీ అన్నారు. అమ్మ నాన్న చెప్పిన మాట వింటే తలెత్తుకుని బతుకుతారని తెలియజేశారు.
ఇక స్టూడెంట్స్ సెల్ ఫోన్లు ఎక్కువగా వడకూడదని.. పుస్తకాలు చదవాలని పేర్కొన్నారు. అలాగే మాతృభాషను మరిచిపోవద్దని, తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని విద్యార్థులకు హరీష్ రావు హితవు పలికారు.