బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:47 IST)

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

monkey
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో ఈ దారుణ ఘటన 
చోటుచేసుకుంది.