శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (18:52 IST)

ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్‌చల్.. కారు నుంచి దిగకుండా పూజలు (video)

Aghori
Aghori
ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్‌చల్ చేసింది. మంగళగిరిలో కనిపించిన అఘోరి డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్‌ను కలవాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించింది. ఆపై ఇబ్రహీంపట్నం వద్ద కారు నుంచి బయటకు రాకుండా కారులోనే పూజలు చేసింది. 
 
కారు నుంచి బయటకు రావాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక అఘోరి కారు అద్దాలపై స్థానిక ప్రజలు దాడి చేశారు. 
 
కాగా హైదరాబాద్‌లో ఓ అమ్మవారి ఆలయాన్ని కొందరు అల్లరి మూకలు కూల్చి వేయడంతో ఈ అఘోరి ఆ ఆలయంలో పూజలు చేసింది. ఆ తర్వాత అక్కడక్కడ కనిపిస్తూ హల్ చల్ చేస్తోంది.