మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జనవరి 2024 (14:23 IST)

హైదరాబాదు: ట్రెండింగ్‌లో బిర్యానీ టీ.. మసాలా చాయ్‌ని తలదన్నేలా..?

Tea
Tea
హైదరాబాదులో ప్రస్తుతం బిర్యానీ టీ ట్రెండ్ అవుతోంది. వేడి నీళ్లల్లో స్ట్రాంగ్ టీపొడితో పాటూ బిర్యానీలో వాడే ఆకులు, దాల్చిన చెక్కలు, మసాలా దినుసులు, సోంపు, కావాల్సినన్ని యాలకులు, నల్లమిరియాలు, గసగసాలు, అర టీస్పూన్ ఫెన్నెల్, అర టీస్పూన్ టీ ఆకులు జోడించి దీన్ని తయారు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీ వెరైటీలకంటే భిన్నంగా ఉన్న ఈ పానీయం నగరవాసులకు బాగా నచ్చడంతో అనేక చోట్ల బిర్యానీ టీ స్టాళ్లు ప్రారంభమవుతున్నాయి. మసాలా చాయ్‌ని తలదన్నేలా ఈ టీ ఉంటుంది. అసలే ఇది శీతాకాలం కావడంతో ఈ టీని టేస్ట్ చేసేందుకు జనం ఎగబడుతున్నారు.