గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (20:58 IST)

రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు

child marriage
రంగారెడ్డి జిల్లాలో 14 ఏళ్ల బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకోవడంతో బాల్యవివాహం ఆగిపోయింది. ఎన్జీవో సంస్థలు 14ఏళ్ల బాలిక వివాహాన్ని అడ్డుకున్నాయి. ఇంకా బాలికను పాఠశాలకు పంపమని తల్లిదండ్రులను ఒప్పించారు. 
 
2030 నాటికి తెలంగాణలో బాల్య వివాహాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో మైనర్ బాలికను రక్షించినట్లు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా సభ్యులు తెలిపారు. 
 
బాల్య వివాహ రహిత తెలంగాణగా మార్చేందుకు నిరంతర జోక్యంతో పాటు, బాల్య వివాహాలు చేయకూడదని తల్లిదండ్రుల నుండి 200 సంతకాలు, బాల్య వివాహాలకు సంబంధించి 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం గతేడాది నుండి చేపట్టింది.