గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (14:04 IST)

తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్

Gaddam Prasad
Gaddam Prasad
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో 9 మంది కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ కేబినెట్ పూర్తిగా పునరుద్ధరణ కాబోతోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎంపికయ్యారు. 
 
వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టారు. 
 
ప్రసాద్ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రకటించింది.