శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (11:32 IST)

బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఇంటి నుంచి బయటికి వచ్చిన..?

rape
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకరమైన అంశం. మహిళల భద్రతకు భరోసా కల్పించడం తక్షణ అవసరం. తాజాగా సికింద్రాబాద్‌లో ఓ బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, బాధితురాలు తన ఫోన్‌ను అతిగా వాడుతున్నట్లు సమాచారం. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా, ఆమె ఒంటరిగా ఉండటాన్ని రాపిడో డ్రైవర్ గమనించాడు. 
 
కాసేపటికి ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలుపెట్టాడు. తన మాటలకు ఆమె పడిపోయేలా చేసి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసి లాడ్జి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు ర్యాపిడో డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.