1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 డిశెంబరు 2023 (23:15 IST)

కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం

kcrcm
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు యశోధ వైద్యులు వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించిందని వారు తెలిపారు. సర్జరీ విజయవంతం కావడంతో కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి సాధారణ రూమ్‌కు మార్చారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి మరో 6 నుంచి 8 వారాలు దాకా పడుతుందని వైద్యులు వెల్లడించారు.
 
కాగా గురువారం అర్థరాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో బాత్రూమ్‌లో కాలుజారి పడిన విషయంతెల్సిందే. దీంతో ఆయనను ఆర్థరాత్రి సమయంలోనే యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శుక్రవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
సీటీ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని తెలిపారు. ఈ ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయం (రెండు నెలలు) పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఆర్థోపెడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లనరీ డీమ్ ఆయనను పర్యవేక్షిస్తుందని తెలిపారు.
 
కొద్దిసేపటి క్రితం కేసీఆర్ తుంటిమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని వైద్యులు తెలిపారు.