శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2024 (22:14 IST)

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

chapati roll
సికింద్రాబాద్‌లో విషాదకర ఘటన జరిగింది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కోవడంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విరన్ జైన్‌గా గుర్తించారు. సికింద్రాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి విద్యాభ్యాసం చేస్తున్నాడు.

హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి ప్రాణాలను ఓ చపాతీ రోల్ తీయడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో కూరుకున్నారు.