సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (14:31 IST)

ఫాంహౌస్‌లో తండ్రిని కలిసిన కవిత... తండ్రి పాదాలకు నమస్కరించి...

kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసింది. దీంతో ఆమె తీహార్ జైలు నుంచి ఐదున్నర నెలల తర్వాత విడుదలయ్యారు. మంగళవారం విడుదలైన ఆమె బుధవారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. గురువారం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో ఉన్న తండ్రిని కలిసేందుకు వెళ్లారు. ఫామ్‌ హౌస్‌లో తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన చేతికి ముద్దు పెట్టారు. 
 
కొన్ని నెలల తర్వాత తన కుమార్తె జైలులో ఉండటంతో తల్లడిల్లిపోయిన కేసీఆర్.. ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాంగా దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. కుమార్తెను చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించింది. ఆ సమయంలో కవిత భర్త అనిల్, కవిత కుమారుడు కూడా ఉన్నారు. కవిత రాకతో ఎర్రవ ర్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కోలాహలంగా, సందడిగా కనిపించింది. కాగా, పది రోజుల పాటు ఈ ఫాంహౌస్‌లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. అందువల్ల తనను కలిసేందుకు పార్టీ నేతలు ఎవ్వరూ రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.