ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (07:57 IST)

బాలాపూర్ లడ్డూ వేలం.. కొత్త రూల్స్.. హుండీ ఆదాయం రూ.70లక్షలు

Balapur Laddu
Balapur Laddu
బాలాపూర్ వినాయకుడి లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్వాహకులు కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. బాలాపూర్ లడ్డూ వేలం మంగళవారం ప్రారంభం కానుంది. 
 
బాలాపూర్ లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతోంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం రూ.450 పలికిన లడ్డూ 2023లో రూ.27 లక్షలు పలికింది. ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆలయాన్ని తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. 
 
ఖైరతాబాద్ మహా గణపతి హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.