బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (16:25 IST)

రూ.50 లక్షల కట్నం.. ఐపీఎస్ అంటూ మోసం.. నాలుగేళ్లుగా..?

crime scene
హైదరాబాదు నగరం బాచుపల్లిలో ఓ మహిళ మోసపోయింది. ఐఏఎస్ అధికారినని నమ్మించి పెళ్లి.. నాలుగేళ్ల తర్వాత బండారం బయటపడింది. తాను ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్టు ప్రచారం చేసుకున్నాడు. అలాగే నమ్మించి రూ.50 లక్షల కట్నం తీసుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ (38) ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్టు ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబ సభ్యులు సందీప్‌ను సంప్రదించారు. 2018లో శ్రావణితో సందీప్ వివాహమైంది. 
 
ఈ సందర్భంగా రూ.50 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు అందుకున్నాడు. నాలుగేళ్ల పాటు ఒక్క పైసా కూడా తేకపోవడంతో అనుమానించిన భార్య డబ్బులేం చేస్తున్నావని నిలదీస్తే.. తాను రూ.40 కోట్లు సంపాదించానని, అయితే ఐటీ కట్టకపోవడంతో అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారని చెప్పాడు. రూ. 2 కోట్లు కావాలని చెప్పడంతో ఆమె ఏదో రకంగా సమకూర్చింది. 
 
ఈ క్రమంలో అనుమానం వచ్చిన శ్రావణి భర్త ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సందీప్‌తోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు.