ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జులై 2024 (09:44 IST)

హైదరాబాదులో భారీ వర్షాలు... ట్రాఫిక్‌తో చిక్కులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

hyderabad city
హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
 
జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, బేగంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, ప్రగతినగర్, హైదర్ నగర్, బోవెన్‌పల్లి, నిజాంపేట్, మైత్రీవనం, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, బోరబండ, ఉప్పల్, ఎల్‌బీ నగర్, రామంతపూర్, హయత్‌నగర్, తిరుమలగిరి, ఎల్బీనగర్, బోయెర్లసీ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
 
దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని సూచించారు.