ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:22 IST)

మిజోరం గవర్నర్‌ హరిబాబుకు తీవ్ర అస్వస్థత - గ్రీన్‌చానెల్‌లో తరలింపు

kharibabu
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గ్రీన్‌చానెల్ ద్వారా హైదరాబాద్ నగరానికి తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ నగరంలో చికిత్స పొందేనిమిత్తం మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి సోమవారం ఎయిర్ అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ, గగనతలంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ విషయమై వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని హరిబాబును కేవలం 30 నిమిషాల్లో ప్రత్యేక అంబులెన్స్‌లో నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆస్పత్రికి వెళ్లి హరిబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.