ఆదివారం, 16 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మార్చి 2025 (14:12 IST)

హోలీ వేడుకల పేరుతో విద్యార్థినిలను అసభ్యంగా తాకుతూ ప్రిన్సిపాల్ వెకిలి చేష్టలు (Video)

teacher - student
హోలీ వేడుకల పేరుతో కాలేజీ డిగ్రీ విద్యార్థినిల పట్ల ప్రిన్సిపాల్ అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినిలను అసభ్యంగా తాకుతూ బురద నీటిలో పడేసి పొర్లించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాలలో వెంకటపతి ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, హోలీ సందర్భంగా కాలేజీలో సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలతో కాసేపు ఆడిపాడిన వెంకటపతి.. అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. యువతులపై పైపులతో నీళ్లు చల్లుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. 
 
మరికొందరు విద్యార్థినిలను ప్రైవేట్ భాగాలపై తాకుతూ ఎంజాయ్ చేశాడు. అందులో నుంచి ఒక అమ్మాయిని ఏకంగా పక్కన నిలిచి బురదలో ఎత్తేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అనుచితంగా ప్రవర్తించిన వెంకటపతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.