1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (19:27 IST)

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..

fire accident
రంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చింతల్‌మెట్ చౌరస్తాలోని ఓ పరుపుల గోదామ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.   
 
దూది, కట్టే వస్తువులు ఉండడంతో క్షణాల మీద మంటలు భారీగా వ్యాపించాయి. దీంతో గోదాంలో ఉన్న ఓ వాహనం పూర్తిగా దగ్ధమైంది. గోదాంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.