ఔటర్ రింగ్ రోడ్డు టు ఇబ్రహీంపట్నం, ప్రేమజంటల రాసలీలలు, దోపిడీ దొంగతనాలు
వనస్థలిపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకుని ఇబ్రహీంపట్నం వెళ్లే దారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు తనిఖీల్లో బైటపడింది. దీనితో ఆ రోడ్డు మార్గంలో ప్రజలు వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా వుంటుండంతో దోపిడీలు చేసే ముఠాలు కాచుకుని కూర్చున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే మార్గంలో యువ జంటలు చాటుమాటు వ్యవహారాలను కూడా సాగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనితో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో రెండు జంటలు వారి కంటకు కనిపించారు. వారిని పట్టుకుని ఇటువైపు రావద్దంటే ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ రెండు జంటల్లో ఒక జంట సమీపంలో వున్న కళాశాలకు చెందినవారు కాగా మరో జంట ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా గుర్తించారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా బహిరంగ ప్రదేశాలకు, నిర్మానుష్య ప్రదేశాలకు రావద్దని చెప్పి పంపించారు. ఒకవేళ తప్పనిసరిగా ఇబ్రహీపట్నం వెళ్లాలనుకునేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నలుగురైదుగురు కలిసి వెళ్లాలని సూచిస్తున్నారు.