తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?
తెలంగాణ లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమోండెంట్‌గా పనిచేస్తున్న గంగారం.. ఓ అపార్ట్‌మెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశారు. కానీ అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గంగారం ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. అర్ధరాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు.
కానీ మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.