బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:59 IST)

తెలంగాణ వరద బాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు సాయం

Reliance Foundation
Reliance Foundation








తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ కూడా తన వంతుగా వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం అందించింది.
 
ఇందులో భాగంగా తెలంగాణ వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి రూ.20 కోట్లు రిలయన్స్ ఫౌండేషన్ విరాళంగా అందించింది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందించారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.20 కోట్ల చెక్కును అందించారు.