సమ్మక్క-సారమ్మల జాతర- ఏర్పాట్లన్నీ సిద్ధం.. ఫిబ్రవరి 21న..?
సమ్మక్క-సారమ్మల జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించి రూ.75కోట్ల నిధులు కేటాయించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించారు.
ఎంతో విశిష్టత కలిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం వుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సమ్మక్క-సారలక్క జాతర కోసం ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి భక్తులు బారులు తీరారు. సంక్రాంతి పండుగకు వరస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు.
జాతరలో ఫిబ్రవరి 21న కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు. 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి.. గద్దెపై ప్రతిష్టిస్తారు. 23న వనదేవతలు గద్దెలపై కొలువదీరనున్నారు.